రాష్ట్రానికి కృష్ణమ్మ వరదతోపాటు మరో వరద కూడా వచ్చింది అదే వార్తల వరద . శ్రీశైలం లో నీటి మట్టం పెరగటంతో మొదలైన ఈ వరద కృష్ణవేణమ్మ సముద్రంలో కలిసేంతవరకు కొనసాగింది .
ఈ వార్తల వరదలో ఎప్పటిలాగానే మన టి వి 9 వారు తమ సహజ సిద్దమైన ప్రతాపం చూపించారు .
చిన్న విషయాన్నీ కూడా సేన్సషనల్ చెయ్యగల వీరి సామర్ధ్యం గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు అది యావత్తు తెలుగు ప్రజలకు తెలిసిందే కాని మనం చెప్పుకోవలసిన ఒక విషయం వుంది అదే టి వి ౯ ప్రతినిధులు వరదల్లో కొట్టుకుపోతున్న ప్రజలను కాపాడటం . ఇంతకి విషయంలోకి వస్తే సదరు టీవీ ఖధనం ప్రకారం వాళ్ళ ప్రతినిధులు ఇరవై నుండి ముప్పై అడుగుల లోతున్న నీట్లో ప్రాణాలకి సైతం లెక్క చెయ్యకుండా వరదల్లో చిక్కుకున్న చాలా మందిని కపాదేసరు అని చెబుతూ కొన్ని దృశ్యాలను కుడా ప్రసారం చేసారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చూపిస్తున్న దృశ్యాల్లో వెనకాల చాలా మంది బొడ్డు లోతు నీలల్లో అటు ఇటు తిరుగుతున్నారు దీనిని బట్టి మనకి తెలిసింది ఏంటంటే అసలు అక్కడ వున్నది కేవలం నాలుగు నుంచి అయిదు అడుగుల నీరు మాత్రమే . చెప్పుకో దగ్గ ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రతినిధి మాత్రం నీటుగా టక్ చేసుకొని చేతిలో టి వి ౯ మైక్ మాత్రం కనబడేలా పట్టుకోవటం . వెనకాల కంటికి నిజాలు అలా కనిపుస్తున్నా మరి ఇంతలా బరితెగించి అబద్దాలు ఎలా చెబుతున్నారో వాళ్ళకే తెలియాలి ..
ఇలాంటి వాటికీ మేము దూరము అంటూ ఎప్పటిలాగానే ఈ టి వి 2 తనదైన విధానం లో వార్తలు ప్రసారం చెయ్యటమే కాకుండా ఎంతో సంయమనం తో వ్యవహరించినదుకు ఈటి వి ౨ ను మాత్రం అభినందించాల్సిందే .
మరీ టి వి 9 అంత కాకపోయినా మిగతా న్యూస్ చానళ్ళు ( ఈటివి 2 తప్ప ) కుడా మేము ఏమి తక్కువ తినలేదు అంటూ టి వి9 తో పోటి పడటానికి ట్రై చేసాయి ... ఎవరు ఎంత ట్రై చేసినా టి వి ౯ ని దాటగలిగే దమ్ము ఎవరికి వుంది చెప్పండి .
Thursday, October 8, 2009
Thursday, October 1, 2009
ఆనాడు-ఈనాడు
పాత చెక్క పెన్నుల్లో కొత్త ముల్కులేసి
లేత వేళ్ళతో దానిని ఒడిసి cపట్టి
రాసిన రాతలు చేరగక ముందే
నా దెల్లు లాప్ టాప్ పై
ఎవ్వనపు ముని వేళ్లు
లయభాద్ధంగా నాట్యమాడుతున్నాయి ...
మా ఊరి వీధి బడిలో
నేల బల్లపై చోటుకై
పట్టిన కుస్తీ మరవకు ముందే
ఆఫీసులో నాకై కేటాయించిన
తిరుగాడే కుర్చీలో
వెనక్కి వాలి సేదతిరుతున్నాను ...
లేత వేళ్ళతో దానిని ఒడిసి cపట్టి
రాసిన రాతలు చేరగక ముందే
నా దెల్లు లాప్ టాప్ పై
ఎవ్వనపు ముని వేళ్లు
లయభాద్ధంగా నాట్యమాడుతున్నాయి ...
మా ఊరి వీధి బడిలో
నేల బల్లపై చోటుకై
పట్టిన కుస్తీ మరవకు ముందే
ఆఫీసులో నాకై కేటాయించిన
తిరుగాడే కుర్చీలో
వెనక్కి వాలి సేదతిరుతున్నాను ...
Wednesday, April 15, 2009
Wednesday, April 8, 2009
ముందు మాట
ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు? అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?
Subscribe to:
Comments (Atom)
