Thursday, October 1, 2009

ఆనాడు-ఈనాడు

పాత చెక్క పెన్నుల్లో కొత్త ముల్కులేసి
లేత వేళ్ళతో దానిని ఒడిసి cపట్టి
రాసిన రాతలు చేరగక ముందే

నా దెల్లు లాప్ టాప్ పై
ఎవ్వనపు ముని వేళ్లు
లయభాద్ధంగా నాట్యమాడుతున్నాయి ...


మా ఊరి వీధి బడిలో
నేల బల్లపై చోటుకై
పట్టిన కుస్తీ మరవకు ముందే

ఆఫీసులో నాకై కేటాయించిన
తిరుగాడే కుర్చీలో
వెనక్కి వాలి సేదతిరుతున్నాను ...

1 comment:

తృష్ణ said...

అదే మరి కాల మహిమ....!బావుందండి.